Home  »  TV News  »  Podharillu : బావ అంటే ఇష్టమని చెప్పేసిన గాయత్రి పొదరిల్లు సీరియల్‌లో ఊహించని ట్విస్ట్!

Updated : Apr 16, 2026


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -93 లో.. రాత్రి మాధవ డ్రింక్ చేసి గాయత్రి దూరం అవుతుందని ఎమోషనల్ అవుతాడు. అదంతా ప్రొద్దున లేచి మర్చిపోతాడు. ఒకవైపు గాయత్రి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. ఎంగేజ్మెంట్ దగ్గర పెట్టిన పాటలు ఇంట్లో వాళ్ళకి డిస్టబెన్స్ లాగా అనిపిస్తాయి. మాధవ తన సైట్ దగ్గర ఏం పని లేకున్నా సరే వెళ్ళాలని అనుకుంటాడు. ఈ రోజు ఆదివారం కదా అన్న పని ఉండదు కదా అని కేశవ వాళ్ళు అంటారు. లేదు కొంచెం పని ఉందని మాధవ అంటాడు. అప్పుడే మాధవతో పాటు పనికి వెళ్లే అతనితో చక్రి మాట్లాడుతాడు. దాంతో మాధవకి పనిలేదని ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అంటే అన్నయ్య ఇక్కడ ఉండలేక వెళ్తున్నాడని ఇంట్లో వాళ్లకి అర్థమవుతుంది.

ఆ తర్వాత ఈ రోజు నేను వంట చేస్తాను.. పెద్దికి రెస్ట్ అని మహా అనగానే ఆమ్మో అని ఇంట్లో వాళ్ళు భయపడుతారు. మరొకవైపు నారాయణ కావాలనే తాయారు ఇంటిముందు సైకిల్ పై పాటలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతాడు. ఎక్కడ ఎంగేజ్మెంట్ చెడగొడుతాడో అని తాయారు వాళ్ళు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత నారాయణ వెళ్తుంటే మ్యారేజ్ బ్రోకర్ ఎదురుపడతాడు. మీరు సంబంధం చూడమని చెప్పినప్పటి నుండి అసలు నాకు బేరాలు రావడం లేదని అతను అంటాడు. ఆ తర్వాత ఇంట్లో వంట వద్దు.. అందరం బయటకు వెళ్లి తినేసి వద్దామని మహా అనగానే ఇంట్లో వాళ్లంతా ఒప్పుకుంటారు. ఇక్కడ ఉండి ఈ దరిద్రం చూసే బదులు వెళ్ళిపోయింది బెటర్ అని నారాయణ అంటారు. అలా అందరు కార్ లో బయల్దేరతారు. అప్పుడే అబ్బాయి తండ్రి ఫోన్ మాట్లాడుతు.. కార్ కి అడ్డుగా వస్తాడు. దాంతో చక్రి కార్ ఆపుతాడు. కార్ లో ఉన్న మాధవని గుర్తుపట్టి ధర్మాత్ముడు మీరా అని మాట్లాడుతాడు.. రండి ఎంగేజ్మెంట్ కి మీ వాళ్ళు పిలవగానే వచ్చినందుకు సంతోషం అని అబ్బాయి వాళ్ళ నాన్న అంటాడు. ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ కి వెళ్లి వాళ్ళకి చుక్కలు చూపించాలని నారాయణ అంటాడు. మాధవ వద్దని అంటాడు. ఆ తర్వాత అందరు కార్ దిగుతారు. అబ్బాయి తండ్రి తాయారు వాళ్ళని పిలిచి వాళ్ళని లోపలికి ఆహ్వానించమని చెప్తాడు. ఎన్ని గొడవలున్నా మీ అన్నయ్య కుటుంబంతో సహా వచ్చాడని అబ్బాయి తండ్రి అంటాడు. దాంతో వేరే దారి లేక నారాయణ వాళ్ళని  లోపలికి రండి అని నారాయణ వాళ్ళ అన్న పిలుస్తాడు.

ఎక్కడ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తారోనని తాయారు వాళ్ళు భయపడుతారు. కావాలనే గాయత్రికి ఎదురుగా అందరు కూర్చొని ఉంటారు. వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకొని రా అని మాధవని స్టేజ్ పైకి పంపిస్తాడు నారాయణ. ఫొటోస్ దిగమని చెప్తాడు. దాంతో మాధవ ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆపడానికే వచ్చామని తాయారుకి చక్రి ఝలక్ ఇస్తాడు. ఆ తర్వాత గాయత్రి రింగ్ తొడుగు అని తాయారు అంటుంది. హేయ్ ఆపమని గాయత్రి గట్టిగా అరుస్తుంది. తరువాయి భాగంలో బావ అంటే ఇష్టమని వెళ్లి హగ్ చేసుకుంటుంది గాయత్రి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.